Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం త్వరలో జరగబోయే కె.టి దొడ్డి మండల పరిధిలోని  పాగుంట, వెంకటాపురం గ్రామం శ్రీశ్రీశ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) పోస్టర్లు ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  ఆవిష్కరించారు.

21న కళ్యాణ మహోత్సవం.. 22న రథోత్సవం, 23న స్వామివారి పల్లకి సేవ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే  భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలి. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. దేవాలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు,   మాజీ ఎంపీపీలు విజయ్ రాజారెడ్డి, మాజీ జడ్పిటిసి రాజశేఖర్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ తిమ్మప్ప, మాజీ ఆలయం కమిటీ డైరెక్టర్ అభిలాష్, నాయకులు ఉరుకుందు చంద్రశేఖర్ యుగంధర్ గౌడ్, వెంకన్న గౌడ్, వెంకటన్న, కురమన్న, భగవంతు,  గోపి , అమరేష్, వీరేష్, ఈవో పురేందర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -