నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలంలోని లక్కొరా గ్రామానికి చెందిన గంగపల్లి ప్రశాంత్ కు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించిన రూ.లక్ష 50వేల ఎల్ఓసి పత్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స కొరకు నిమ్స్ ఆస్పత్రిలో చేరిన గంగపల్లి ప్రశాంత్ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు విన్నవించారు. స్పందించిన ఆయన ప్రభుత్వ నుండి రూ.లక్ష 50వేల ఎల్ఓసి మంజూరు చేయించారు. అట్టి ఎల్ఓసి మంజూరు పత్రాన్ని హైదరబాద్ లోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. చికిత్స కొరకు ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
బాదిత కుటుంబానికి ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే వేముల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES