Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల:  గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో ఎర్రవల్లి మండలం ధర్మవరం బిసి ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు.  జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషయాలను  తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటన శుక్రవారం రాత్రి ఎర్రవల్లి మండలం ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 50 మందికి పైగా అస్వస్థతకు గురి కావడం జరిగింది. రాత్రి వైద్యులు వెంటనే స్పందించి ఆ విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని  జరగకుండా మెరుగైన వైద్య చికిత్స అందించారు. ఇందులో కొంతమంది విద్యార్థులు గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులు  ఉన్నారు. తల్లిదండ్రులు ఎవరు కూడా అధైర్య పడవద్దని విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు వైద్యులు సరైన సమయంలో విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్,  ఉన్నతాధికారులు వెంటనే ఈ సంఘటనకు గల కారణాలను తెలుసుకొని వాటిని పరిష్కరించి భవిష్యత్తులో మరొక్కసారి జరగకుండా  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -