- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
అభివృద్ధి ప్రదాత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సతీమణి అర్చన జన్మదిన వేడుకలు బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సర్పంచుల శిక్షణ కేంద్రం వద్ద మద్నూర్, డోంగ్లి, ఇరు మండలాల చెందిన సర్పంచులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అందరికీ స్వీట్లు పంచి పెట్టారు. ఎమ్మెల్యేకు సతీమణి అర్చన జుక్కల్ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు. అర్చన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
- Advertisement -



