Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతిభ కనబర్చిన మోడల్ స్కూల్ విద్యార్థులకు సత్కారం.!

ప్రతిభ కనబర్చిన మోడల్ స్కూల్ విద్యార్థులకు సత్కారం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్  ఫలితాల్లో మండలం ఎడ్లపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సోమవారం పాఠశాలలో కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ పూర్ణచందర్రావు,గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇంకా మంచి చదువులు చదివి,ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరారు. ఫలితాలు  సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -