భారతీయుల భద్రతకు విజ్ఞప్తి
శాంతికి అనుకూలంగా ఉన్నామని వ్యాఖ్య
ట్రంప్ సూచనల మేరకే అని ప్రచారం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధం ప్రారంభమయ్యాక మోడీ చేసిన తొలి ఫోన్ కాల్ ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో భారత పౌరుల భద్రత, వస్తుసేవలు, ఇంధన సరఫరా అంశాలపై మోడీ మాట్లాడారు. పెరుగుతున్న ఉద్రిక్తతలు, పౌర ప్రాణనష్టం, మౌలిక సదుపాయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి, స్థిరత్వానికి భారతదేశం కట్టుబడి ఉంటుందని చెప్పారు.
చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే ఇరాన్ హార్ముజ్ జలసంధిని దాదాపు మూసివేసిన సమయంలో ఈ సంభాషణ జరిగింది. అంతకుముందు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుత పరిస్థితి గురించి ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరఘ్చితో ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనల మేరకే మోడీ ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. యుద్ధం ప్రారంభమై 13 రోజులు దాటినా ఇరాన్ లొంగకపోవడంతో ట్రంప్ ఈ తరహా దౌత్యానికి ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ అధ్యక్షుడికి ‘మోడీ’ ఫోన్
- Advertisement -
- Advertisement -



