స్వాగతం పలికిన ప్రధాని అన్వర్ ఇబ్రాహీం
మలేషియా- భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై భేటీ
కౌలాలంపూర్ (మలేషియా) : రెండురోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ శనివారం మలేషియాకు చేరుకున్నారు. మోడీకి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీం విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇరువురూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అలాగే మలేషియాలోని ప్రవాస భారతీయులు మోడీకి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మోడీ, అన్వర్‌లు ఇద్దరూ ఒకే కారులో అధికారిక హోటల్‌కు వెళ్లారు. కాగా, మలేషియా- భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి తమ చర్చలు దోహదపడనున్నాయని మోడీ పర్యటనకు ముందు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఆర్థిక, ఆవిష్కరణ, కొత్త రంగాల్లో భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు సహకారం మరింత పెంచుకోవడమే లక్ష్యంగా ఉండనున్నట్టు మోడీ పోస్టులో పేర్కొన్నారు.



