- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : జూన్ మాసం వచ్చింది అంటే వానాకాలం పంట సాగు సమయం వచ్చినట్లే. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు రైతన్న వానాకాలం పంట సాగుకు సిద్ధమయ్యారు. మద్నూర్ మండలంలో రైతన్న అరకలతో సోయా కంది పంట సాగు ఊపందుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి భూములు తడిగా ఉండటం, కొంతమంది భూములు ఆరక సాగులకు అనుకూలంగా ఉండడంతో సాగు చేపడుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా భూములను చదును చేసుకుంటున్నారు. కొంతమంది రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. మండలంలో రైతులు జూన్ రెండవ వారంలో వానాకాలం పంట సాగు పనులు మొదలుపెట్టారు.
- Advertisement -