Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల పరిధిలో జోరుగా వానాకాలం పంట

మండల పరిధిలో జోరుగా వానాకాలం పంట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్, డోంగ్లి, మండలాల వ్యవసాయదారులు ఎలాంటి సాగునీటి సౌకర్యం లేకపోయినప్పటికీ వర్షాధారం పైనే ఆధారపడి వానాకాలం పంట వేశారు. ఈ సీజన్ లో అన్ని రకాల పంటలు కలిసి 50వేల 65 ఎకరాల పంట సాగు చేస్తున్నారు. ఈ పంటలు వంద రోజులకు చేతికి వస్తాయి. ఆ తర్వాత రబ్బి పంట సాగులో భాగంగా సెనగ పంట అధికంగా వేస్తారు. ఆ తర్వాత జొన్,న కుసుమ, అంతర్ పంటలుగా దోసకాయ, బర్రె మినుము, మిరపకాయ, పంట తదితర పంటలు వేస్తారు. ఆ పంటలు ప్రతి సంవత్సరం ఉగాది వరకు చేతికి వస్తాయి.

ఈ విధంగా ఈ ఇరు మండలాల పరిధిలో వ్యవసాయదారులు కౌలు రైతులు ప్రస్తుతం సాగుచేసిన వానాకాలం పంటలకు వర్షాలు పడలేక ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడకపోయినప్పటికీ పంటలు కాపాడుకోవడానికి పురుగుల మందులతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది వానాకాలం పంట సాగులో సోయా పంట 35 వేల ఎకరాలు, వరి పంట 6వేల200 ఎకరాలు , పత్తి పంట 4 వేల ఎకరాలు, కంది పంట 5200 ఎకరాలు, మినుము పంట 1550 ఎకరాలు, పెసర పంట 1250 ఎకరాలు, మక్కా 150 ఎకరాలు, చేసినట్లు వ్యవసాయ అధికారుల నివేదికలను బట్టి తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -