Friday, October 17, 2025
E-PAPER
Homeజాతీయంనన్ను అరెస్టు చేస్తే మరిన్ని సమస్యలు

నన్ను అరెస్టు చేస్తే మరిన్ని సమస్యలు

- Advertisement -

సోనమ్‌ వాంగ్‌చుక్‌ వ్యాఖ్యలు

లేహ్ : తనను అరెస్టు చేస్తే మరిన్ని సమస్యలు తలెత్తుతాయని పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ వ్యాఖ్యానించారు. లడఖ్‌లో తలెత్తిన హింసాత్మక ఘటనలకు తాను కారణమంటూ హోం శాఖ నిందించడాన్ని ప్రస్తావిస్తూ ఇది తనను ‘బలిపశువును చేసే ఎత్తుగడ’లంటూ వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ఒక్కసారిగా హింస చెలరేగడానికి వాంగ్‌ చుక్‌ కారణమంటూ కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దానిపై స్పందిస్తూ ఆయన, కఠినమైన ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద తనను అరెస్టు చేయడానికి కూడా సిద్ధంగా వున్నానని చెప్పారు. పిఎస్‌ఎ కింద కేసు నమోదు చేసి, రెండేండ్ల పాటు జైల్లో పెట్టేందుకు వారు చూస్తున్నారని ఆయన పిటిఐతో వ్యాఖ్యానించారు. దానికి కూడా తాను సిద్ధమేనని చెప్పారు. అయితే తనను వదిలివే యడం కన్నా జైల్లో పెడితేనే మరిన్ని సమస్యలు తలెత్తు తాయని ఆయన వ్యాఖ్యానించారు.

అసలు సమస్యకు మూలాన్ని పరిష్కరించుకుండా, బలి పశువులను చేయడం కోసం ప్రభుత్వం వెతుక్కుంటోందని, ఒకసారి ఈ హింసను నేను రెచ్చగొట్టానని అంటున్నారు, మరోసారి కాంగ్రెస్‌ చేసిందం టున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. యువత అంతా ఇప్పటికే నిరాశా నిస్పృహలతో, తీవ్ర అసహనంతో వున్నందున తక్షణమే విజ్ఞతతో కూడిన నిర్ణయం తీసుకోవాలన్నారు. దీర్ఘకాలంగా అణచిపెట్టుకున్న కోపం, ఆగ్రహావేశాలే నిన్నటి పరిస్థితులకు కారణమని చెప్పారు. ఆరేళ్ళపాట నిరుద్యోగం, ప్రతీ స్థాయిలోనూ అమలు కాని హామీలతో ప్రజలు విసిగిపోయారన్నారు. శాంతిని నెలకొల్పే చర్యలకు బదులుగా తనను బలి పశువును చేసే ప్రయత్నాలకు దిగడం విచారకరమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ కౌన్సిలర్‌పై కేసు నమోదు
ఆందోళనకారులను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ స్టాంజిన్‌ త్సెపాగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖానికి ముసుగు వేసుకుని చతిలో కర్రతో వున్న ఒక వ్యక్తి ముఖం సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఆ ఫోటో అ కౌన్సిలర్‌దేనని బిజెపి చెబుతోంది. ఈ నిరసనలకు నేతృత్వం వహించిన ఇతర రాజకీయ నేతలు కూడా చర్యలు ఎదుర్కొంటారని పోలీసులు చెప్పారు. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తిస్తున్నామని, ఇప్పటివరకు 50మందిని అరెస్టు చేసినట్టు ఒక పోలీసు అధికారి తెలిపారు. హింస, పోలీసు కాల్పులు జరిగిన కొన్ని గంటల తర్వాత కేంద్రం, వాంగ్‌చుక్‌ రెచ్చగొట్టే ప్రకటనల వల్లనే ఇదంతా జరిగిందని విమర్శించింది. లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కవిందర్‌ గుప్తా కూడా ఇదే తరహాలో ఆందోళనకారులపై వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -