Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్సీని కలిసిన మోటడిరెడ్డి పట్టణ కార్యవర్గం

మాజీ ఎమ్మెల్సీని కలిసిన మోటడిరెడ్డి పట్టణ కార్యవర్గం

- Advertisement -

నవతెలంగాణ- మోపాల్
నిజామాబాద్ పట్టణ మొటడి రెడ్డి సంక్షేమ సంఘం నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సంఘ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా అరికెలా నర్సారెడ్డి మాట్లాడుతూ.. తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని, జిల్లాలో ఉన్న అందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని సూచించారు. జిల్లా రెడ్డి బంధువులకు ఎటువంటి సహకారం కావాలన్నా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అయిన గాదరి సంజీవరెడ్డి, మోతె నవీన్ రెడ్డి అరికెల నర్సారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో కోశాధికారి శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి, సంఘ సభ్యులు వినోద్ రెడ్డి, గంగారెడ్డి, సుభాష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad