Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య

కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య

- Advertisement -

ఏడాదిగా పుట్టింట్లోనే ఉన్నా పట్టించుకోని భర్త
సర్దిచెప్పి అత్తింట్లో వదిలేసిన తల్లిదండ్రులు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గొల్లగూడెంలో విషాదం

నవతెలంగాణ-బీబీనగర్‌
భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలు.. ఏడాదిపాటు పుట్టింట్లో ఉన్నా భర్త పట్టించుకోకపోవడం.. తల్లిదండ్రులూ తనకే సర్దిచెప్పి అత్తింట్లో వదిలిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు పసి పిల్లలను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన ఐశ్వర్య(30)కు ఐదేండ్ల క్రితం బీబీనగర్‌ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్‌తో వివాహమైంది. రెండేండ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో ఏడాది క్రితం ఐశ్వర్య పుట్టింటికెళ్లింది.

సోమవారం తన తల్లిదండ్రులతోపాటు పెద్దమ్మ, పెదనాన్నతో కలిసి అత్తారింటికి వచ్చింది. ఆ సమయంలో భర్త మేకల మహేశ్‌ లేకపోవడంతో ఐశ్వర్యకు తల్లిదండ్రులు సర్దిచెప్పి వెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన ఐశ్వర్య మంగళవారం ఉదయం తన ఇద్దరు పిల్లలు ఝాన్సీ(2), పండు(10 నెలలు)ను ఊపిరాడకుండా చేసి చంపింది. ఆ తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన అత్తామామలు చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -