- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చర్లపల్లిలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి విజయశాంతి రెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఒంటరితనం, మానసిక ఒత్తిడితోనే విజయశాంతి రెడ్డి సూసైడ్ చేసుకున్నట్లు తేల్చారు. భర్త దుబాయ్‌లో ఉండటం, పిల్లలు ఇద్దరు హాస్టళ్లలో ఉండటం, తాను ఐటీ కంపెనీలో రాత్రి డ్యూటీలు చేస్తుండటంతో మానసికంగా ఇబ్బందిపడ్డట్టు తేల్చారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురై.. తాను లేకపోతే పిల్లలు కూడా ఒంటరి వాళ్లు అవుతారని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారు.
- Advertisement -



