Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా

తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా

- Advertisement -

జన్మదిన వేడుకల్లో మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు
నవతెలంగాణ – మద్నూర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు కొనియాడారు. సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఉష సంతోష్ మేస్త్రి ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్ అభ్యర్థి వార్డు అభ్యర్థులు కలిసి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఉషా సంతోష్ మేస్త్రి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను సోనియా గాంధీ తల్లి సహకారంతో నెరవేరిందని అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా గెలిపించాలని కోరారు. సోనియా గాంధీ సహకారంతోనే ప్రత్యేక రాష్ట్ర సాధన నెరవేరిందని పేర్కొన్నారు.ఈ జన్మ దిన వేడుకల్లో ఉషా సంతోష్ మేస్త్రి మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్ మాజీ ఎంపీటీసీ రాములు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -