Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మచ్చపూర్ లో తల్లుల కమిటీ మీటింగ్ 

మచ్చపూర్ లో తల్లుల కమిటీ మీటింగ్ 

- Advertisement -

ధనలక్ష్మి అంగన్వాడి టీచర్ 
నవతెలంగాణ-గోవిందరావుపేట 

మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో తల్లుల కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగిందని టీచర్ ధనలక్ష్మి తెలిపారు. బుధవారం అంగన్వాడీ సెంటర్లో సర్పంచి జంపాల ప్రభాకర్ హాజరై  మొదట అంగన్వాడి ప్రాముఖ్యతను తల్లులకు పిల్లలకు వివరించారు. పౌష్టికాహారం విలువను తెలియజేస్తూ తల్లులు పిల్లలు అంగన్వాడి సెంటర్లకు  ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్.బి.ఎస్.కె డాక్టర్ శ్రీనివాస్ ఆరోగ్య ప్రాముఖ్యత, మరియు పరిశుభ్రత గురించి దానివల్ల కలిగే లాభాలు నష్టాలు, క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పలువులు హల్లులు పిల్లలు కిశోర బాలికలు బాలింతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -