Friday, July 18, 2025
E-PAPER
Homeబీజినెస్ఎన్‌ఐఆర్‌ఎం- సిబీ మైనింగ్‌ మధ్య ఎంఓయూ

ఎన్‌ఐఆర్‌ఎం- సిబీ మైనింగ్‌ మధ్య ఎంఓయూ

- Advertisement -

హైదరాబాద్‌ : మైనింగ్‌, మౌలిక సదుపాయాల రంగంలో కంట్రోల్డ్‌ బ్లాస్టింగ్‌ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఓ ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన గనుల మంత్రిత్వశాఖ కింద పనిచేసే స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌ (ఎన్‌ఐఆర్‌ఎం), సిబీ మైనింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కలిసి దేశవ్యాప్తంగా ప్రాజెక్టులలో సహకరించుకోవడానికి ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
ఈ ఎంఓయూ మీద సిబీ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ సిబీ లూకోస్‌, ఎన్‌ఐఆర్‌ఎం డైరెక్టర్‌ (అదనపు చార్జి) డాక్టర్‌ శ్రీపాద్‌ ఆర్‌ నాయక్‌ బుధవారం సంతకాలు చేశారు. ఈ రెండు సంస్థలకు ఉన్న సాంకేతిక నైపుణ్యంతో దేశవ్యాప్తంగా కీలకమైన ప్రాజెక్టులలో సురక్షితంగా, కచ్చితంగా, సరికొత్త సజనాత్మక పద్ధతుల్లో బ్లాస్టింగ్‌ పరిష్కారాలకు దారి చూపుతాయి.
2000 సంవత్సరంలో హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా ప్రారంభించిన సిబీ మైనింగ్‌ దేశంలో కంట్రోల్డ్‌ బ్లాస్టింగ్‌ విషయంలో నైపుణ్యం ఉన్న సంస్థల్లో ఒకటిగా మంచి గుర్తింపు పొందింది. జాతీయ రహదారులు, విద్యుత్‌ ప్రాజెక్టులు, మైనింగ్‌లో వ్యర్థాల తొలగింపు, ఉత్పత్తి పెంపుదల కోసం తవ్వకాలు, రాళ్ల బ్లాస్టింగ్‌ పనులను ఈ ఎన్‌ఐఆర్‌ఎం, సిబీ మైనింగ్‌ మధ్య ఒప్పందం
ఈ ఒప్పందం సురక్షిత, ఖచ్చితమైన బ్లాస్టింగ్‌ పరిష్కారాలను అందించి, బొగ్గు తవ్వకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచుతుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందంపై సిబీ మైనింగ్‌ ఎండీ సిబీ లూకోస్‌, ఎన్‌ఐఆర్‌ఎం డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీపాద్‌ ఆర్‌. నాయక్‌ సంతకాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -