Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిర్బంధాలతో ఉద్యమాలను అనచలేరు

నిర్బంధాలతో ఉద్యమాలను అనచలేరు

- Advertisement -

అంగన్వాడీల అక్రమ అరెస్టులకు ఖండించిన
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిర్బంధాలతో ఉద్యమాలను అనుచలేరు అని, అంగన్వాడీల అక్రమ అరెస్టులను  సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం అంగన్వాడి సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉన్నందున రాత్రి నుండే అంగన్వాడి ఉద్యోగులను, సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే బదులు పోలీసు నిర్బంధాల ద్వారా ఉద్యమాన్ని అంచాలనుకోవటం అవివేకం అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు.

బుధవారం రాత్రి నుండి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ను, తనను పోలీసులు గృహనిర్బంధం చేయటం జరిగిందని, అదేవిధంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అనేకమంది అంగన్వాడీ టీచర్లను ఉదయం నాలుగు గంటల నుండి పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించారని, బస్టాండుకు, రైల్వే స్టేషన్లకు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలను ప్రయాణికుల అందరి ముందు మహిళలని కూడా చూడకుండా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారని ఇది ఏ విధమైన ప్రజాస్వామ్యం ప్రభుత్వమే ఆలోచించాలని ఒకవైపు ప్రజా పాలన మరియు ప్రజా సౌమ్య పాలన అని చెప్పుకుంటూ మరొకవైపు తమ సమస్యలను ప్రభుత్వం కు చెప్పుకునే అవకాశం లేకుండా నిర్బంధించటం సరైనది కాదని ఆయన అన్నారు.

నిర్బంధాలతో ఉద్యమాలను అంచాలనుకుంటే అవి మరింత ఉదృతంగా పెరుగుతాయి తప్ప తగ్గవని ప్రజల్లో ప్రభుత్వం పలచన అవుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఈ సవ్యతనం 18000 అమలు జరుపుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, చైర్మన్ బెనిఫిట్స్ను ఇచ్చి పెన్షన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పినా హామీలు అమలు జరపకపోగా అంగన్వాడీ ఉద్యోగాలకే ఎస్ఆర్ తెచ్చే విధంగా ప్రీ ప్రైమరీ పియం శ్రీ విధానాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వలన అంగన్వాడీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని మరొకవైపు ఆన్లైన్ విధానంలో ఫోటో క్యాప్చర్ ను తీసుకురావడంతో అంగన్వాడి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీటిని రద్దు చేయాలని వారి ఆందోళనలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఇది సరైంది కాదని ఆయన అన్నారు.

ఇప్పటికైనా వెంటనే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి నిర్బంధాలను విడనాడాలని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంత నిర్బంధాల్ని ప్రయోగించిన వందలాదిమంది హైదరాబాదుకు తరలి వెళ్లడం జరిగిందని దీన్నిబట్టి అయినా అంగన్వాడీ ఉద్యోగుల నువ్వు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. లేనియెడల గత ప్రభుత్వాలకు ఏ విధమైన గుణపాఠం జరిగిందో. ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న అంగన్వాడీల అరెస్టులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకులు సవిత, స్వాతి, విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -