‘బబుల్ గమ్’తో సక్సెస్ అందుకున్న హీరో రోషన్ కనకాల తాజాగా ‘మోగ్లీ 2025’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు సందీప్ రాజ్ (కలర్ ఫోటో) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. శనివారం నిర్మాతలు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. డిసెంబర్ రెండవ వారంలో ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడాన్ని పెద్ద ప్లస్ పాయింట్‌గా మేకర్స్ భావిస్తున్నట్లు తెలిపారు.
నాని వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌తో ఈ చిత్రం స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ వీడియో ప్రేక్షకులకు ‘ది వరల్డ్ ఆఫ్ మోగ్లీ’ని పరిచయం చేసింది. ఎమోషనల్ నెరేటివ్‌లో రోషన్ కనకాల పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు. సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్. వారి అద్భుతమైన కెమిస్ట్రీ ఈ చిత్రంలో హైలెట్‌గా ఉండబోతోంది. బండి సరోజ్ కుమార్ ఒక బలమైన విలన్ పాత్రను పోషిస్తుండగా, హర్ష చెముడు కీలక పాత్రలో కనిపించనున్నారు. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: సందీప్ రాజ్, నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, సంగీతం: కాల భైరవ, డిఓపి: రామ మారుతి ఎం, ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్: కిరణ్ మామిడి, యాక్షన్: నటరాజ్ మాడిగొండ, సహ రచయితలు: రామ మారుతి. ఎం.రాధాకృష్ణ రెడ్డి.
‘మోగ్లీ 2025’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -