నవతెలంగాణ – ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలోని ప్రఖ్యాత సోమేశ్వర స్వామి ఆలయంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సోమవారం నాడు ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు పాల్గొన్నారు.ఆలయ సౌందర్యవర్థనం, భక్తులకు సౌకర్యాలు, మౌలిక వసతుల మెరుగుదల, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని వారు సూచించారు.ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందించి, కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయాన్ని భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తామని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు.
సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఎంపి చామల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



