- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాసకొత్తూర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు కేతిరెడ్డి సురేష్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీకి విచ్చేసిన ఎంపి సురేష్ రెడ్డిని సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, వార్డ్ సభ్యులు పెద్ది సృజనన్, సామా నవీన్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


