- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్‌లో మాజీ సర్పంచ్ బద్దం రమేష్‌రెడ్డిని రాజ్యసభ సభ్యులు కే.ఆర్.సురేష్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం రమేష్ రెడ్డి తండ్రి భూమన్న అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సురేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు. అదేవిధంగా తన స్వగ్రామమైన చౌట్‌పల్లిలో చెర్లపల్లి గడియారం లింగంగౌడ్ వారం రోజుల క్రితం మరణించగా, ఆయన కుటుంబ సభ్యులను సురేష్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట చౌట్ పల్లి సర్పంచ్ మెహబూబ్, నాయకులు గోపిడి లింగారెడ్డి, ఆరెల్లి నవీన్‌గౌడ్, మారు నర్సయ్య, కొమ్ముల రాజేశ్వర్, విఠల్, అహ్మద్ ఉన్నారు.
- Advertisement -



