Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లొంగన్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

లొంగన్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని లొంగన్ జిపి గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలలో భాగంగా శుక్రవారం నాడు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీవో రాము ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి అనురాధతో కలిసి గ్రామంలో ఇందిరమ్మ పథకంలో గృహాలను నిర్మిస్తున్న లబ్ధిదారుల క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో , ఎంపీవో మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులు సమయాన్నికూలంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణాలు చేసుకుని వారికి గ్రామ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథక కమిటీ సభ్యులతో మాట్లాడి వారిని అవగాహన చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఎంపీ ఓ, జిపి కార్యదర్శి అనురాధ, గృహ నిర్మాణ లబ్ధిదారులు, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -