Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలో అంకుల్ ఎంపీడీవో శ్రీనివాస్ మరియు ఎంపీవో రాము ఇందిరమ్మ గృహ పథకంలో నిర్మాణాలు చేస్తున్న గృహాలను గురువారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ రాము పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, ఎంపీవో మాట్లాడుతూ .. జుక్కల్ మండలంలోని 30 గ్రామ పచాయతీ పరిధిలో ఇందిరమ్మ పథకంలో లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని ఖండేబల్లూర్, మహమ్మదాబాద్, కేమ్రాజ్ కల్లాలి, జుక్కల్, జిపిలలో గృహ నిర్మాణాలను అధికారులు పరిశీలించారు.

లబ్ధిదారులు ఏవైనా సాంకేతికంగా సమస్యలు ఉంటే వెంటనే మండల స్థాయి అధికారులకు తెలియజేయాలని వాటిని పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేస్తారని, తప్పకుండా లబ్ధిదారులు తమ కార్యాలయాలకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని తెలిపారు.  గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు డబ్బుల విషయంలో సంకోచించకుడదని తెలిపారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు మూడు దశలలో పూర్తి చేయాలని అటువంటి వారికి తప్పకుండా 3 విడతలుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఎంపీడీవో, ఎంపీడీవో తో పాటు ఆయా గ్రామాల్లో గ్రామపంచయతీ కార్యదర్శులు, గృహ నిర్మాణాల లబ్ధిదారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -