Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ పథకంలో భాగంగా గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను బుధవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే భూ తగాదాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే విధంగా తమ వంతుగా కృషి చేస్తామని లబ్ధిదారులకు సూచించారు. మంజూరైన లబ్ధిదారులు సరితగతిన గృహ నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో తెలియజేశారు. నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు వెను వెంటనే మూడు విడతలుగా డబ్బులను గ్రీన్ ఛానల్ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -