నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని చిన్నవంగర కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని ఎంపీడీవో వేణుమాధవ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి, పాఠశాల ప్రత్యేకాధికారి గంగారపు స్రవంతి కి పలు సూచనలు చేశారు. విద్య బోధన, భోజన సదుపాయం ఇతర మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి, శుచి గల ఆహారాన్ని అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES