Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దఏడ్గిలో సీఎం కప్ పోటీలను ప్రారంభించిన ఎంపీడీవో

పెద్దఏడ్గిలో సీఎం కప్ పోటీలను ప్రారంభించిన ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలో నిర్వహించిన సీఎం కప్ ఆటల పోటీలను జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో ఆటల పోటీలతో పాటు నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్క ఆటగాడు ఆణిముత్యమని అటువంటి వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ప పాటల పోటీలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ఆటల పోటీల వలన ఆరోగ్యంతో పాటు వివిధ రకాల ఆటలను తిలకించడం జరుగుతుంది అని అన్నారు. ఈ ఆటల పోటీలో అన్ని పాఠశాలలోని విద్యార్థులు, విద్యార్థినిల ఆటల పోటీలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.

మండల స్థాయిలో ఆటల పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డివిజన్ స్థాయి మరియు జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి తో పాటు జాతీయస్థాయిలో కూడా వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిభను గుర్తించి వారి నైపుణ్యతను దేశ ప్రజలకు ఎంతో సహాయకారిగా ఉంటదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, పెద్ద ఏడ్గి ప్రధానోపాధ్యాయుడు,  ఎంఈఓ తిరుపతయ్య , ఖండేబల్లూర్ క్లస్టర్ హెచ్ఎం లాలయ్య , జుక్కల్ క్లస్టర్ హెచ్ఎం హనుమంత రెడ్డి , మండలంలోని సీఆర్పీలు భీమ్రావు,  భీమన్న , బిల్లు సింగ్, ఉపాధ్యాయులు హీరా జాదవ్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -