Thursday, February 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలుగులో రాబోతున్న అరుదైన థ్రిల్లర్‌ 'మృత్యుంజయ్'

తెలుగులో రాబోతున్న అరుదైన థ్రిల్లర్‌ ‘మృత్యుంజయ్’

- Advertisement -

శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్‌ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. రమ్య గున్నం సమర్పణలో లైట్‌బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై సందీప్‌ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్‌ జంటగా నటించారు. ఈ సినిమాని ఈనెల 27న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సందర్బంగా బుధవారం ఈ చిత్ర టీజర్‌ను సోషల్‌ మీడియా వేదికగా అగ్ర దర్వకుడు రాజమౌళి రిలీజ్‌ చేశారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, ‘ఇది కంప్లీట్‌ థ్రిల్లర్‌గా నడుస్తుంది. సాంగ్స్‌ లేకుండా, హీరోయిన్స్‌ లేకుండా, కామెడీ లేకుండా ఒక హానెస్ట్‌ థ్రిల్లర్‌లు మన తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి.

హుస్సేన్‌ ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి కంటెంట్‌ను తెలుగు వారికి అందించాలనే ఉద్దేశంతో సందీప్‌ ఈ మూవీని నిర్మించారు. ఇలాంటి కథలు చెప్పినప్పుడు ఒకలా.. చేసేటప్పుడు ఇంకోలా.. ఆర్‌ఆర్‌ అయిన తరువాత చూసుకుంటే మరోలా ఉంటుంది. ఇందులోని విజువల్స్‌, లొకేషన్స్‌ చాలా కొత్తగా ఉంటాయి. కాలభైరవ తన సంగీతంతో మ్యాజిక్‌ చేశాడు. చాలా తక్కువ పాత్రలతో ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పర్ఫామెన్స్‌ కూడా కొత్తగా ఉంటుంది. ట్రైలర్‌ తరువాత కథ మరింత అర్థం అవుతుంది’ అని అన్నారు. ‘శ్రీ విష్ణు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు, సినిమాలు చేయలేదు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

హుస్సేన్‌ సుకుమార్‌ టీంలో ఓ మెంబర్‌. ఆయన చెప్పిన ఈ కథ విన్నప్పుడు హీరోకి ఇందులో పర్ఫామెన్స్‌ కావాలి అని అనిపించింది. అప్పుడు నాకు గుర్తు వచ్చిన మొదటి పేరు శ్రీ విష్ణు. అద్భుతమైన కథకు, గ్రేట్‌ టెక్నికల్‌ టీం దొరికింది. కాల భైరవ మ్యూజిక్‌, సాగర్‌ విజువల్స్‌ గురించి అందరూ మాట్లాడుకుంటారు’ అని నిర్మాత సందీప్‌ గున్నం చెప్పారు. దర్శకుడు హుస్సేన్‌ షా కిరణ్‌ మాట్లాడుతూ, ‘నిర్మాతలందరూ అలాంటి కథ ఉందా?, ఇలాంటి కథ ఉందా అని అడుగుతారు. కానీ ఈ నిర్మాతలు మాత్రం నీకు నచ్చిన కథ చెప్పు అన్నారు. ఇలాంటి కథలు చాలా రేర్‌గా వస్తాయి. ఈ సినిమాకి కథే హీరో. నా సోదరి మనీషా ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేశారు. సాగర్‌ ఈ మూవీలో ఎంతో కష్టపడ్డాడు. కాల భైరవ తన సంగీతంతో అద్భుతం చేశాడు. శ్రీకర్‌ తన ఎడిటింగ్‌తో జీవం పోశారు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -