Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్తూరులో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు..

కొత్తూరులో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి : మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో గల కొత్తూరు గ్రామంలో సోమవారం ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎం ఎస్ పి, ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా అధికార ప్రతినిధి గజ్జలప్రసాద్ ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు మంచి వైద్యం అందాలని ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఏబిసిడి వర్గీకరణ నేడు సాధించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గజ్జల రాంబాబు, గజ్జల సంపత్ గ్రామ ఉపాధ్యక్షులు గజ్జల సందీప్, ప్రధాన కార్యదర్శి నవీన్, ఎంఎస్ ఎఫ్ నాయకులు గజ్జల నిఖిల్, గజ్జల హరీష్, సన్ని, లోహిత్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -