- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల పరిధిలోని మోగా గ్రామ శివారు ప్రాంతంలో కొనసాగుతున్న ఉపాధి పనులను శనివారం ఆ మండల ప్రత్యేక అధికారి కామారెడ్డి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు నిబద్ధత ప్రకారం కొనసాగేలా చూడాలని కూలీలకు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలతో పనులు నిర్వహించాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు ఆ గ్రామ కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేశారు. ఈ పనుల పరిశీలనలో డోంగ్లి మండల ఎంపీడీవో జగదీష్ మోగా గ్రామ సర్పంచ్ ఆలే బస్వంత్ గ్రామ కార్యదర్శి నందు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



