Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బురదమయమైన కేమ్రాజ్ కల్లాలి తాండా రోడ్డు..

బురదమయమైన కేమ్రాజ్ కల్లాలి తాండా రోడ్డు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలం పరిధిలోని కేమ్రాజ్ కల్లాలి తాండా మార్గాన గ్రామాలకు వెళ్ళే రోడ్డు చిన్నపాటి వర్షానికే బురదమయమైంది. దీంతో రోడ్డుపై ఉన్న గుంతలలో నీరు నిల్వడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని నెలలుగా ఈ సమస్య గ్రామంలో నెలని ఉన్నా.. నాయకులు పట్టించుకోవడం లేదని  గ్రామస్తులు తెలిపారు. ఓట్ల సమయంలో వచ్చి ఓట్లు దండుకోవడం తప్ప స్థానిక సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కల్లాలిలోని ఎంపియుపిఎస్ పాఠశాలకు తాండ నుండి కాలినడకన వచ్చే విద్యార్థిని, విద్యార్థులు మోకాలిలోతు నీళ్లలో దిగి రావలసిన దుస్థితి ఏర్పడింది.

కొత్తగా కాలనీ ఏర్పాటు కావడంతో రోడ్డుకు ఇరువైపులా నూతనంగా భవనాలు నిర్మాణం కావడం గతంలో వేసిన  రోడ్డు క్రిందకు కుంగిపోయింది. అందుకే నీరు నిలవడం జరుగుతుంది. రోడ్డుకి హైట్ పెంచడం తప్ప మార్గం లేదని, తాండ నుండి గ్రామం వరకు సిసి రోడు కొత్తగా వేయాలి. లేకుంటే గ్రామస్తులకు సమస్యలు తప్పవని తెలిపారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి రోడ్డుపై నీరు నిల్వకుండా, బురద ఏర్పడకుండా గుంతలను పూడ్చివేసి నూతనంగా సిసి రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పదించి, కేమ్రాజ్ కల్లాలి తాండా అంతర్గత మార్గంలో సీసీరోడ్లు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad