Saturday, July 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ అభివృద్ధికి పెద్ద పీట..

ముధోల్ అభివృద్ధికి పెద్ద పీట..

- Advertisement -

– ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
నవతెలంగాణ -ముధోల్ :  నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ అభివృద్ధి పెద్ద పీట వేస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజు కళ్యాణ్ లక్ష్మి,షాదిముభారక్, చెక్కు లను లబ్దిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన 18 నెలల్లో ఐదుసార్లు కళ్యాణ్  లక్ష్మి, షాదిముభారక్ చెక్కులను  పంపిణీ చేశానన్నారు. పెండింగ్లో ఉన్న మిగతా చెక్కులను త్వరలో లబ్దిదారులకు  అందజేయున్నట్లు ఆయన పేర్కొన్నారు. బ్రహ్మంన్ గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులకు 5 కోట్ల 80 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ నిధులకు  టెండర్   పూర్తి అయిన తర్వాత ఎత్తిపోతల మరుమ్మతుల పనులు ప్రారంభం అవుతాయని  అన్నారు. ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు.  పెండింగ్ లో ఉన్న 28ప్యాకేజీ  పనులు పున ప్రారంభం అయ్యేవిధంగా చూస్తానని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను  అసెంబ్లీలో లేవనెత్తి ప్రభుత్వ దృష్టికి తెస్తున్నానన్నారు‌.  మరో మూడున్నర  సంవత్సరం కాలంలో ముధోల్ ను సస్యశ్యామలం చేస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, ఆత్మ చేర్మన్ గన్ను నర్సారెడ్డి, తహశీల్దార్ శ్రీలత, నాయబ్ తహశీల్దార్ తెలంగ్ రావ్, ఆర్ఐ నారాయణ రావు పటేల్, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, నాయకులు గంట శ్రీనివాస్, విఠల్ రావు, నిమ్మ పోతన్న,దత్తాద్రి, రాం చందర్, సప్పటోల్ల పోతన్న, రమేష్, లక్ష్మినారాయణ,కాసారం శ్రీకాంత్,  సంతోష్, సాయినాథ్, మోహన్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -