నవతెలంగాణ – ముధోల్
ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు గ్రామానికి నూతన తారు రోడ్డును ప్రభుత్వం నిధులతో వేయించి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రజలచే శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎమ్మెల్యే గా గేలిస్తే ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామానికి నూతన తారు రోడ్డు వేయిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పవార్ రామారావు పటేల్ గతంలో హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో ప్రధాన రోడ్డు కుడా డబుల్ రోడ్డు వేయిస్తాన్నాని చెప్పారు.
దీంతో ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిపొందిన తర్వాత విట్టోలి తాండా నుండి ఆష్ట గ్రామం వరకు తారు రోడ్డు కు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం కు విన్నవించారు. దీంతో ప్రభుత్వం బిటి రోడ్డు నూతన నిర్మాణాన్నికి సూమారు రూ.3 కోట్లు మంజూరు చేసింది. దీంతో బీటీ రోడ్డు పనులు గత కోన్ని రోజులు గా కోనసాగుతున్నాయి. అయితే తాజాగా ఆష్ట గ్రామంలో ముందుగా డబుల్ తారు రోడ్డు పనులను ప్రారంభంఅయ్యయి. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో సూమారు 500 మీటర్లు గా పైగా డబుల్ బీటీ రోడ్డు పనులు కోనసాగటంపై సర్వత్రా హర్ష వ్యక్తం అవుతోంది.



