నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన 2 వ సాదారణ మున్సిపాలిటీ ఎన్నికలు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా లోని 104 వార్డులకు గాను 350 మంది బరిలో నిలిచారు. 202 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు నిర్వహించగా 1,32,711 మంది ఓటర్లకు గాను 1,13, 398 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, జిల్లా మొత్తం 87.1 శాతంగా పోలింగ్ శాతం నమోదయింది. భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులకు గాను 157 మంది బరిలో నిలిచారు. రెండవ విడత సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు నువ్వా – నేనా అన్నట్టు ప్రచారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నాం వరకు మందకోడిగా కొనసాగింది. మధ్యాహ్నం నుంచి పోలింగ్ పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు ఆలేరు లో 11 శాతం, భువనగిరి లో 9 శాతం, చౌటుప్పల్ లో 11 శాతం, మోత్కూరు లో 12 శాతం, పోచంపల్లి లో 7 శాతం, యాదగిరిగుట్ట లో 14 శాతంగా నమోదయింది.
ఉదయం 11 గంటలకు ఆలేరు లో 27 శాతం, భువనగిరి లో 31 శాతం, చౌటుప్పల్ లో 33 శాతం, మోత్కూరు లో 35 శాతం పోచంపల్లి 24 శాతం, యాదగిరిగుట్టలో 36 శాతం నమోదయింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆలేరులో 52 శాతం, భువనగిరిలో 47 శాతం ,చౌటుప్పల్ లో 60 శాతం ,మోత్కూర్లో 58 శాతం, పోచంపల్లిలో 51 శాతం యాదగిరిగుట్టలో 58 శాతం గా నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆలేరులో 73 శాతం, భువనగిరిలో 67 శాతం , చౌటుప్పల్ లో 79 శాతం, మోత్కూరులో 76 శాతం, పోచంపల్లిలో 63 శాతం, యాదగిరిగుట్టలో 78 శాతంగా నమోదయింది. సాయంత్రం ఐదు గంటల వరకు ఆలేరు లో 85.81శాతం, భువనగిరి లో 82.93 శాతం, చౌటుప్పల్ లో 91.91శాతం, మోత్కూరు లో 86.92 శాతం, పోచంపల్లి లో90.95 శాతం, యాదగిరిగుట్ట లో 89.86 శాతంగా నమోదైంది. జిల్లాలో అత్యధికంగా చౌటుప్పల్ లో 91.91శాతం, అత్యల్పంగా భువనగిరి లో 82.93 శాతంగా నమోదైంది. జిల్లాలో మొత్తంగా 87.01 శాతంగా పోలింగ్ జరిగింది.


