Wednesday, February 11, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేటలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్ 

అశ్వారావుపేటలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్ 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
చెదురుమదురు ఘటనలు మినహా అశ్వారావుపేట మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మూడు పురపాలక సంఘాల పోలింగ్ లో అశ్వారావుపేటలోనే అధికంగా నమోదు అయింది. అశ్వారావుపేట 76.20, కొత్తగూడెం 74.19, ఇల్లందు 68.44 శాతం నమోదు అయింది. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో 35 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్లు 16850 గానూ 12839 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.76.29 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇందులో 4 వ వార్డు లో 679 మంది ఓటర్లు కు గానూ 608 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ వార్డులో అత్యధికంగా 89.54 శాతం పోలింగ్ నమోదైంది. 12 వ వార్డు లో 732 ఓటర్లు కు గానూ 461 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ వార్డులో అత్యల్పంగా 62.97 శాతం పోలింగ్ నమోదైంది.

అశ్వారావుపేట మున్సిపాలిటీ పోలింగ్ లో చిన్నపాటి గందరగోళం నెలకొంది.ఏ ఎస్ ఆర్ నగర్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.మొత్తం  35 పోలింగ్ కేంద్రాలు ఉండగా 10 మాత్రమే చక్రాల కుర్చీ లు(వీల్ చైర్లు) ఏర్పాటు చేయడం తో వృద్దులు, వికలాంగుల ఇబ్బంది కి గురయ్యారు. 14 వ వార్డు లోని  పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేయడానికి వెళ్లిన మహిళకు ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ పేపర్ ఇచ్చి కాంగ్రెస్ కు ఓటేయాలని పోలింగ్ బూత్ లోనే ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఓటరు బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. 9 వ వార్డు లోని 12 వ పోలింగ్ బూత్ లో ఓ మహిళ ఓటు వేయటానికి వెళితే నీ ఓటు వేసేసావు అంటూ ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా చెప్పటం,మహిళా ఓటర్ భర్త వచ్చి నిలదీసి అడగడంతో ఎంట్రీ లో తేడా పడిందని ఎన్నికల సిబ్బంది నాలుక కరుచుకొని ఓటు వేయించటం వంటి ఘటన చోటు చేసుకుంది.

20 వ వార్డు పోలింగ్ కేంద్రం ఎదురుగా అభ్యర్థి గృహం ఉండటంతో పోలింగ్ కేంద్రం ముందు కూర్చుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ ప్రత్యర్థి అనుచరులు నెత్తీనోరు బాదుకున్నా పోలీసులు గాని ఎన్నికల సిబ్బంది గాని మున్సిపల్ సిబ్బంది గాని అటువైపు చూడటం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి.అసెంబ్లీ మాదిరిగా హోమ్ ఓటింగ్ ఇవ్వకపోవడంపై ఎన్నికల కమిషన్ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. 14 వ వార్డు కి చెందిన బుక్కూరీ పార్వతీ అనే వృద్ధురాలు ప్రమాదానికి గురై కాలు కు తీవ్రగాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నేరుగా అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి కుటుంబ సభ్యులు తీసుకుని వచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -