Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి 

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి 

- Advertisement -

– సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్  
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ ఐదో మహాసభలు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఎస్ వి రమ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి  పాలడుగు  సుధాకర్, కామరెడ్డి సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో బతుకమ్మగుంటలో సుమారు 280 మందితో ఈ మహాసభలు నిర్వహించడం జరిగిందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్ అన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..మున్సిపల్  కార్మికుల పర్మినెంట్ చేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబంలో  ఒకరికి ఉద్యోగం ఇస్తూ, 60 సంవత్సరాల నిండిన, అరోగ్యం బాగా లేక ఈ మధ్య విధుల్లో లేకపోయిన  కార్మికులను నిధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పీఎఫ్,  ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, జిల్లా కేంద్రంలో కార్మికుల కోసం ఆస్పత్రిని  నిర్మించాలని, పిఎఫ్ డబ్బులను సక్రమంగా కార్మికుల అకౌంట్లో జమ చేయాలని, మున్సిపల్ కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని ఈ మహాసభలో నిర్ణయించడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం మున్సిపల్ యూనియన్ గా సిఐటియుగా ఎంతటి పోరాటాల పైన సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ లో పనిచేస్తున్న   వాటర్ వర్క్స్ తో పాటు వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులు  పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad