Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్నూరు కాపు నూతన కమిటీ సభ్యులకు సన్మానం

మున్నూరు కాపు నూతన కమిటీ సభ్యులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీగా ఎన్నికైన సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ పటేల్ రౌతువార్ శుక్రవారం సాయంత్రం తన సొంత ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా శాలువాలతో సభ్యులందరికీ సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ పటేల్ మాట్లాడుతూ.. మున్నూరు కాపు బలోపేతానికి కృషి చేయాలని కోరారు. గ్రామ మున్నూరు కాపులంతా నూతన కమిటీ సభ్యులకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.

ఐక్యతకు ఏకగ్రీవమే నిదర్శనం అన్నారు. సన్మాన కార్యక్రమంలో అధ్యక్షులు పాకల సాయిలు, గౌరవ అధ్యక్షులు గ్రామ ఉపసర్పంచ్ వట్నాల రమేష్, ప్రధాన కార్యదర్శి చౌలవార్ అనిల్, యూత్ అధ్యక్షులు బొగ్గుల సంజు, కమిటీ ఉపాధ్యక్షులు కంచిన్ యాదవ్, ఉపాధ్యక్షులు గడ్డివారు తుకారం, కోశాధికారి రౌతువార్ నాగేష్, జాయింట్ సెక్రెటరీ తూము గంగారం, నూతన కమిటీ సభ్యులతోపాటు లక్ష్మీనారాయణ ఆలయ కమిటీ చైర్మన్ సందుర్వార్ హనుమాన్లు, కు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తుల వార్ సంతోష్, థైదల్వార్ రవి, శ్రీపద్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -