Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు మున్నూరు కాపు సంఘ ప్రమాణ స్వీకారోత్సవం 

రేపు మున్నూరు కాపు సంఘ ప్రమాణ స్వీకారోత్సవం 

- Advertisement -

తరలిరానున్న అతిరథమహారథులు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షునిగా ధర్మపురి సంజయ్ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, తదితరులు రానున్నారని, అలాగే జిల్లా ఎంపీ అరవింద్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి లతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను, వివిధ కుల సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు.  ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.  ఈ ప్రమాణస్వీకారం ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున ర్యాలీ నగరంలో ఉండనుంది. ఈ సన్మాన సభకు ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మున్నూరు కాపు సంఘం నాయకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -