నవతెలంగాణ – కంఠేశ్వర్
సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన పాత నేరస్థుడు రియాజ్ అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం ముగిశాయి. కానిస్టేబుల్ ప్రమోద్ను శుక్రవారం హత్య చేసి పారిపోయిన నిందితుడు రియాజ్ ఆదివారం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.కానిస్టేబుల్ ప్రమోద్ను శుక్రవారం (అక్టోబరు 18) హత్య చేసి పారిపోయిన నిందితుడు రియాజ్ ఆదివారం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.
కాగా, సోమవారం ఆస్పత్రిలో పోలీసుల రివాల్వర్ లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్చి చంపారు. మంగళవారం ఉదయం ప్రాంతంలో నిజామాబాద్ నగరంలో పోలీసు బందోబస్తు నడుమ రియాజ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. దీపావళి పండుగ రోజు రియాజ్ను పోలీసులు హతమార్చడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు సైతం తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. నరకాసుర వధ జరిగిందని పోస్టులు పెడుతున్నారు.