జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో 85 వివిధ సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులకు, సిబ్బందికి ఫాసషల్ రీకార్గినేషన్ యాప్ లో నమోదు చేసుకోవవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ,యస్ సి, యస్. టీ , బీసీ వెల్ఫేర్, మైనార్టీ, మోడల్ స్కూల్, కేజీ బివి, హాస్టల్ లో చదివే విద్యార్థినీ విద్యార్థులు సిబ్బంది తప్పకుండా యాప్ ద్వారా తన హాజరును ఎఫ్ ఆర్ ఎస్ ద్వారా హాజరు శాతం, సిబ్బంది యొక్క అటెండన్స్ ధ్రువీకరించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, అధికారులు పాల్గొన్నారు.



