Monday, November 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలునా చిన్ననాటి కల నెరవేరింది: రామ్‌ చరణ్‌

నా చిన్ననాటి కల నెరవేరింది: రామ్‌ చరణ్‌

- Advertisement -

ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ కాన్సర్ట్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు అతిథులుగా హాజరైన రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌, బుచ్చిబాబు సానా ఆడియన్స్‌లో మరింత జోష్‌ నింపారు. ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్‌ లైవ్‌ పెర్ఫామెన్స్‌కి ఆహుతుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, ‘రెహ్మాన్‌ సంగీతంలో భాగమవ్వాలనేది నా చైల్డ్‌హుడ్‌ డ్రీం. అది నా ప్రాజెక్ట్‌ ‘పెద్ది’తో నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

”పెద్ది’ సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను. మా ఫస్ట్‌ సింగిల్‌ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాతో మీకు ఒక డిఫరెంట్‌, యూనిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడానికి చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తున్నాం’ అని నాయిక జాన్వీ కపూర్‌ అన్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘చికిరి..’ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సష్టిస్తోంది. మొత్తం 13 దేశాల్లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. వెంకట సతీష్‌ కిలారు వద్ధి సినిమా బ్యానర్‌ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పెద్ది 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -