Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీతారాంపురం గ్రామ అభివృద్ధే నా లక్ష్యం 

సీతారాంపురం గ్రామ అభివృద్ధే నా లక్ష్యం 

- Advertisement -

సర్పంచ్ ధారావత్ భాస్కర్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని సీతారాంపురం గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరచడమే నా లక్ష్యం అని ఆ గ్రామ సర్పంచ్ ధారావత్ భాస్కర్ తెలిపాడు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచ్ గా గెలిపించిన ప్రతి ఒకరికి పేరుపేరునా కృతజ్ఞతలు అని అన్నారు. వారి రుణం తీర్చుకోవాలంటే గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరచడమే అని అన్నారు. నా నియమకానికి నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అని అన్నారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి ముందుగా ఏది అవసరమో దాన్ని సత్వరమే పరిష్కార మార్గంగా కృషి చేస్తానని అన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే మరియు ఎంపీ వద్దకు వెళ్లి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామంలోని మౌలిక వసతులు అన్ని రంగాలుగా ఉండే విధంగా అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు త్రాగునీరు వీధిలైట్లు సిసి రోడ్లు సైడ్ కాలువలు ఇలా అన్ని రకాల పనులు చేయించేందుకు నా శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -