Monday, March 16, 2026
E-PAPER
Homeదర్వాజమేరా భాష మహాన్‌

మేరా భాష మహాన్‌

- Advertisement -

గమ్యాన్ని చేరడానికి ఒక బాట కావాలి
ఒక భాష కావాలి
భవితకు చదువుల దిక్సూచి భాష
నవ చరితకు సంస్కారాల మార్గదర్శి భాష
అలల నడకతో నదీ ప్రవాహగతిని గుర్తించినట్టు
మనం భాషతో గుర్తించబడి
గురిచూసి వదిలే బాణం ఎలా లక్ష్యాన్ని చేరుతుందో
భాష కూడా అంతే
భాష – పూర్వీకుల భిక్ష
స్వీయజాగ్రతలే శ్రీరామరక్ష
నూతనోత్తేజాన్ని జ్ఞానోదయాన్ని అభ్యుదయాన్ని
సామాజిక చైతన్యాన్ని అందించేది భాష
ఉనికిని అస్తిత్వాన్ని నిలబెట్టేది భాష
ముడిచిన రెక్కలతో మొగ్గలా కాదు
ముకుళిత హస్తాలతో గుభాళించేది భాష
సరళమైన సున్నితమైన మార్దవమైన భాష
కావాలని కోరను
కవిచెక్కే అక్షరశిల్పానికి
అలంకారాల డాంబికమైన ప్రాకులాట్ఱ్ఱ భాష అనను
కథనానికి కావల్సి అవసరానికి మించిన
పదగుంభనమూ భాష అనను
ప్రతిభకు గీటురాయిగా నిలిచేది భాష
మానసిక పరిపక్వతా అవగాహన ఇచ్చేది భాష
స్పటికంలా స్వఛ్చమైనది భాష
కొత్త సమాజాన్ని స్వప్నిస్తూ
కొత్త సామ్రాజ్యాన్ని శ్వాసిస్తూ
బుర్రను వేడెక్కించే ఎర్రెర్రని భాష కావాలి
దేశం భాష ఎంతలా మార్చిన మూలాలు మారవ్‌ కదా
వేశం యాస ఎంతలా నేర్చిన అర్థాలు మారవ్‌ కదా
– కోటం చంద్రశేఖర్‌, 9492043348

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -