Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నడ్పల్లి పంచాయతీ సర్వసభ్య సమావేశం..

నడ్పల్లి పంచాయతీ సర్వసభ్య సమావేశం..

- Advertisement -

పలు తీర్మానాల ఆమోదం..
నవతెలంగాణ – డిచ్ పల్లి 

వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ పరిధిలో ఎక్కడా బోర్ మోటార్ చేరిపోయిన వేంటనే మరమ్మతులు చేయాలని, త్రాగునీటి కి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఉర పందుల సంచారం ఎక్కువైపోయిందని దీన్ని నియంత్రించడానికి యాజమానులకు నోటిసులు ఇవ్వాలని, చేపట్టాలని గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని నడ్పల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ కులచారి అశ్విని సతీష్ రావు అధ్యక్షతన పంచాయతీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలో తమ తమ కాలనీలో ఉన్న సమస్యలను తెలుపుతూ దాని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తీర్మానించారు.

చేత్త సేకరణ కు ప్రస్తుతం ఒక ట్రాక్టర్ ఉందని,అది సరిపోవడం లేదని, పంచాయతీ పరిధి 6 కిలోమీటర్ల పైబడి ఉంటుందని, ఇదే కాకుండా మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉండటంతో చేత్త తొలగించడానికి ఒక చేత్త అటో కోనుగోలు చేసి , ఐదుగురు పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని తీర్మానించారు.

వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్య ఏర్పడకుండా లీకేజీ లను పూర్తి చేయాలని, దోమల పెరుగుదలను అరికట్టడానికి ఫాగింగ్ చేయాలని దింతోపాటు ఇతర పనులకు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హాజ్ర బేగం సాజిద్, పంచాయతీ కార్యదర్శి గడ్కోల్ గంగాధర్, వార్డు సభ్యులు మోహమ్మద్ అమీర్ అలీ, చింతపంటి రాజారాం, సుగంధర్, విజయ్ కాంత్, శిరీష ,గంగాధర్, తాజ్మోద్దీన్, ఎర్రం భవాని, మామిడల రాజు, సునీత, జానకి, రుద్ర బోయిన లక్ష్మి, కారోబార్ సంతోష్ , రాము, ఆపరేటర్ శ్యామ్ సన్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -