విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. ఈనెల 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విరాట్ కర్ణ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇప్పటివరకు చేసిన రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే. కెరీర్ ప్రారంభంలోనే ఇంత భారీ సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తొలి సినిమా ‘పెదకాపుకూడా భారీ బడ్జెట్ సినిమానే. ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా భారీ బడ్జెట్‌తో తెర కెక్కింది. 'పెదకాపు ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక నటుడిగా 100 శాతం కష్టపడ్డాను. ఆ పాత్రకు కావాల్సిన ప్రతిదీ చేశాను. నటుడిగా మంచి ప్రసంశలు వచ్చాయి. ఆ సినిమా కంటే ఈ సినిమాకు రెట్టింపు కష్టపడ్డాను. అభిషేక్ నామా ఈ కథను సిద్ధం చేసుకుని, ఆ పాత్రకు తగ్గ నటుడి కోసం వెతుకుతున్నారు. ఆ పాత్రకు కావా ల్సిన అన్ని లక్షణాలు ఉన్న కొత్త వ్యక్తి అయితే బాగుం టుందని అనుకున్నారు. ఆ సమయంలో నన్ను పిలిపించి మాట్లాడారు. నాకు కథ చాలా నచ్చింది. చాలా ఎగ్జైట్ అయ్యాను. అలా ఈ జర్నీ మొదలైంది. ఈ కథ విన్నప్పుడే నా పాత్ర ఎలా ఉండాలో ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఈ కథ నా కోసమే రాసినట్టుగా అనిపించింది. రుద్ర, నాగసాధు పాత్రల గురించి చెప్పినప్పుడు చాలా ఉత్సాహంగా అనిపిం చింది.
ఇలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నానని అనిపించింది. వెంటనే పాత్రకు తగ్గట్టుగా బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ చేసుకున్నాను. హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. డాన్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాను. పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. ఇందులో నాగసాధు పాత్ర మేకప్ కి ఆరు గంటల సమయం పట్టేది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది. రెండో సినిమాకే ఇంత లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ రావడం చాలా సంతోషంగా ఉంది. పరిశ్రమలో నాకంటూ ఒక గుర్తింపు రావాలని ఎప్పుడూ అనుకుం టుంటాను. ఒక నటుడికి ఇలాంటి పాత్ర రావడం గొప్ప అవకాశం. ఆ అవకాశం నాకు నాగబంధంతో వచ్చింది. ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమించాను. షూటింగ్ సమయంలో నాకు జ్వరం ఉన్నా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రాణం పెట్టి పనిచేశాను. నిర్మాతలు కూడా కంటెంట్‌పై నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టారు. తొలి సినిమాకే ఇంత గొప్పగా నిర్మించడం మామూలు విషయం కాదు. అలాగే ప్రమోషన్స్ కూడా అద్భుతంగా చేస్తున్నారు. నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ చాలా మంచి స్పందన వస్తోంది. ఆ బుకింగ్స్ చూస్తుంటే దేవుడి ఆశీస్సులు మా మీద ఉన్నాయని అనిపిస్తోంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పటివరకు చూసిన వారందరూ చాలా మంచి రిపోర్ట్ ఇస్తున్నారు. అభిషేక్ నామాకి మాస్ పల్స్ బాగా తెలుసు. ఆయన తీసిన ప్రతి సన్నివేశం నాకు గూస్‌బంప్స్ కలిగించింది. ప్రేక్షకులు కూడా థియేటర్లలో విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఎంజాయ్ చేస్తారు.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే ‘నాగ బంధం`
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



