- Advertisement -
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాలలో మంగళవారం నాగుల చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి గ్రామాల్లోని ఆలయాల్లో, గ్రామాల శివారులో ఉన్న పాముల పుట్టల వద్ద మహిళల ప్రత్యేక పూజలతో సందడి నెలకొంది.మహిళలు నాగుపాము పుట్టల వద్ద పూజలు చేసి, నాగేంద్రుడికి పాలు పోశారు. నాగేంద్రుడికి పూజలు చేసి తమ కుటుంబాలను చల్లంగా చూడాలని మొక్కుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం పైన నాగేంద్రుని ఆలయం సమీపంలో ఉన్న పుట్ట వద్ద, జంబి హనుమాన్ ఆలయంలోని పుట్ట వద్ద మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
- Advertisement -