Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుNagarjuna: బిగ్ బాస్ సీజన్-9 వచ్చేస్తోంది..

Nagarjuna: బిగ్ బాస్ సీజన్-9 వచ్చేస్తోంది..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ మళ్లీ వచ్చేస్తోంది. వరుసగా ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 9వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ సీజన్‌కు ‘డబుల్ హౌస్.. డబుల్ డోస్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు. ఈసారి షో ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈసారి కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా ఈ షోలో అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులతో షో మరింత ఉత్కంఠభరితంగా సాగనుందని, ప్రేక్షకులకు రెట్టింపు వినోదం గ్యారెంటీ అని బిగ్‌బాస్ బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ షో ప్రసార తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img