- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ అగ్రనేత నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. నంబాళ్ల మృతిపై కోటి రివార్డు ఉందన్న పోలీసులు తెలిపారు. అయితే, నంబాళ్ల కేశవరావు మృతిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఓ మైలురాయి విజయం సాధించామని.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 27 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయని పేర్కొన్నారు.
- Advertisement -