– గృహనిర్మాణ రంగంలో సరికొత్త మైలురాయి
నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.95 ద్వారా భవన నిర్మాణ నిబంధనలలో తీసుకొచ్చిన సవరణలను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) తెలంగాణ విభాగం స్వాగతించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం హైదరాబాద్ వంటి మహానగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించడమే కాకుండా.. పట్టణాభివృద్ధిలో పారదర్శకతను పెంచుతుందని నారెడ్కో పేర్కొంది. ముఖ్యంగా టీడీఆర్ వినియోగాన్ని హేతుబద్ధీకరించడం ద్వారా 750 నుండి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన మిడ్ సైజ్ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి మార్గం సుగమం అయిందని దీనివల్ల ప్రైమ్ ఏరియాల్లో కూడా సరసమైన ధరలకే ఇళ్లు లభించే అవకాశం ఉందని నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయ సాయి మేక పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఈ జీఓ అటు ప్రజలకు, ఇటు పర్యావరణానికి, రియల్ ఎస్టేట్ రంగానికి చేకూర్చే ఒక గొప్ప విజయమని” తెలిపారు. నారెడ్కో ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి కొప్పుల మాట్లాడుతూ.. ”టీడీఆర్ ప్రక్రియను సరళీకరించడం ద్వారా ప్రభుత్వం కేవలం నిర్మాణాలనే కాకుండా, సెంట్రల్ లొకేషన్లలో నివసించాలనుకునే మధ్యతరగతి ప్రజల కలలను కూడా సాకారం చేస్తోందని” ఆనందం వ్యక్తం చేశారు.
టీడీఆర్ సంస్కరణలపై క్రెడారు హర్షం
భవన నిర్మాణ నిబంధనలను జీఒ.95 సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని క్రెడారు హైదరాబాద్ ప్రతినిధులు చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. టీడీఆర్ వినియోగాన్ని హేతుబద్ధీకరించడం, హైరైజ్ భవనాల ఎత్తు పరిమితిని 21 మీటర్లకు పునర్నిర్వచించడం, అనుమతుల సమయంలో చెల్లించాల్సిన టీడీఆర్‌ను 50 శాతం చొప్పున రెండు విడతలుగా చెల్లించే సౌలభ్యం కల్పించడం పట్ల క్రెడారు హైదరాబాద్ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి హర్షం ఓ ప్రకటనలో వ్యక్తం చేశారు. ఈ ప్రగతిశీల మార్పులు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంచి, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ అనుకూల నిర్మాణాలకు ఊతమిస్తాయని క్రెడారు పేర్కొంది.
జీఓనెం.95పై నారెడ్కో హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



