సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ..
నవతెలంగాణ – భువనగిరి: కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్ గా మారు స్తూ కార్మికులను మోసం చేస్తున్న నరేంద్ర మోడీ అని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణ అన్నారు. మంగళవారం భువనగిరిలో ఈనెల మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నిర్వహించిన మున్సిపల్ కార్మికుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బడా పెట్టుబడి కార్పోరేట్ లకు అను కూలంగా చట్టాలను మారుస్తూన్నారు. అమెరికా చికాగో నగరంలో ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తామని నిర్వహించిన పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారన్నారు వారి త్యాగ ఫలితమే నేడు 8 గంటల పని వచ్చింది అన్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తిరిగి బ్రిటిష్ కాలం నాటి 12 గంటల పని విధానాన్ని తీసుకురావాలని చూస్తుందన్నారు. కార్మికులు సాధించుకున్న రోజును మేడే కూడా సెలవు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పీఎఫ్ ఈఎస్ఐ లేకుండా గ్రాడ్యుయేట్ లాంటిది హక్కులను లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మధ్యకాలంలో అగ్ని వీరి పేరుతో కేంద్రము యువతకు సైన్యంలో తీసుకొని నాలుగు సంవత్సరాల వరకే ఏదో కొత్త డబ్బులు ఇచ్చి వారి జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. కార్మిక చట్టాలను కాపాడుట కోసం దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్మికులు పూదరి రామచందర్, బట్టు కొండల్, కలకొండ మధు, రవి, ఉప్పు కుమారి, మాచర్ల రాములు, గాయ పాక లక్ష్మీ, నారాయణ, నిర్మల, సత్తమ్మ, బాబు, రేణుక, శాతమ్మ, వరమ్మ, పొట్ట, సునీత, లక్ష్మి నరసమ్మ పాల్గొన్నారు.
కార్మికుల వ్యతిరేకి నరేంద్ర మోడీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES