దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
ఎకో పార్క్, పార్కు కాటేజీలు ప్రారంభం
నవతెలంగాణ-నర్సాపూర్
రాష్ట్రానికి తలమానికంగా నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ ఉంటుందని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివరం నర్సాపూర్ నియోజకవర్గంలో ఎకో పార్క్, కాటేజీలను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఎకో పార్క్ వంటి ప్రాజెక్టులు కొత్త తరానికి స్ఫూర్తినందించే విధంగా ఉంటాయన్నారు. పార్కులోని అరుదైన మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా, వేదికలు, లగ్జరీ సదుపాయాలు, పిక్నిక్ స్పాట్స్, ఈవెంట్స్ నిర్వహించుకునే సదుపాయాలు సందర్శకులను ఆకట్టుకుంటాయని అన్నారు.
ఎంపీ రఘు నందన్ రావు మాట్లాడుతూ.. వందేమాతరం గీతంలోని సుజలం, సుపాలం, మలయజ సీతలాం పదాలలోని ఏదీ అమలవుతలేదని అన్నారు. ఎకో పార్కు చెరువు డంపింగ్ యార్డ్ కావద్దన్నారు. గ్రామాలు పిలుస్తున్నాయి అనే నినాదం రావాలన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గానికి అడవి ఒక ఆస్తి, వరం అన్నారు. పార్క్ వల్ల నర్సాపూర్‌కు మరింత గుర్తింపు వస్తుందన్నారు . ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రెటరీ పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ హమ్మద్ నదీమ్, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి, సువర్ణ, ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, మృగవని గ్రూప్ ఆఫ్ రిసార్ట్స్ ఎండి, విష్ణు చైతన్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టూరిస్ట్ హబ్‌గా నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



